క్రైమ్/లీగల్

బెల్ట్‌షాపులపై టాస్క్ఫోర్సు దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 18: మంచిర్యాల జిల్లా హాజీపూర్ (మం) బుగ్గ గుట్ట ఏరియాలో మూడు బెల్ట్ షాపులపై రామగుండం టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేసి యజమానులను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనర్ సత్యనారాయణ ఆదేశాలమేరకు టాస్క్ఫోర్సు సిబ్బంది హాజీపూర్ మండల బుగ్గ గు ట్ట ప్రాంతంలో ఇటుక బట్టిఏరియాలో రహస్యంగా ఏర్పాటు చేసుకొని నడుస్తున్న నడిపిస్తున్న మూడు బెల్ట్ షాపులపై పక్కా సమాచారంతో దాడి చేసి వారివద్ద నుండి ఓసి మరియు తెలంగాణ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి నిందితుల్లో నస్పూరి వెంకటేష్, దామెర మనోహార్, మడిపెల్లి శంకరయ్యలను తదుపరి చర్యల కోసం హాజీపూర్ ఎస్సైకి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ దాడిలో టాస్క్ఫోర్సు ఎస్సై సమ్మయ్య, సిబ్బంది సంపత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.