క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 18: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ భార్యాభర్తల దుర్మరణానికి కారణమైంది. సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా అదుపుతప్పిన బస్సు రోడ్డు మధ్యలో సిగ్నల్ స్తంభానికి ఢీకొనడంతో ముందు టైర్ బ్లాస్ట్ అయింది. అదే సమయంలో అక్కడ బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించగా కోటేశ్వర్ రావు, అతని భార్య స్వప్న చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు. వీరిలో మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. పీర్జాదిగూడ బాలాజీనగర్‌కు చెందినవీరు బైక్‌పై అన్నోజిగూడకు వెళ్తున్నారు.
ప్రమాదవశాత్తు నారపల్లి దివ్యానగర్ చౌరస్తాలో సిగ్నల్ వద్ద ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన యాదగిరి గుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెంబర్ (ఏపీ 29జడ్ 2157) డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ స్తంభానికి ఢీకొట్టారు. బస్సు ముందు టైర్ బ్లాస్ట్ కావడంతో ముందుకు వేగంగా దూసుకెళ్లిన బస్సు బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు అక్కడే ఉన్న మరికొందరికి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు మరణించారు. గాయపడిన మిగితా వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.