క్రైమ్/లీగల్

మానసిక రోగి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), నవంబర్ 19: మానసిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తి అదృశ్యమైనట్టు స్థానిక పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. కృష్ణాజిల్లా, నూజీవీడు, ఆసిరివల్లి మండాలానికి చెందిన మాదు శివశంకర్(34) కొద్ది రోజుల క్రితం చినవాల్తేరులో గల మానిసిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఈ తరుణంలో ఈనెల 17న ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆసుపత్రి నుండి శివశంకర్ అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బంధువులు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. మూడో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాలను నేడు వేలం వేయనున్న సర్కిల్-2 ఎక్సైజ్ పోలీసులు
విశాఖపట్నం(క్రైం), నవంబర్ 19: మద్యం అక్రమ రవాణాలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం వేలం వేయనున్నారు. నగరంలోని విశాలాక్షినగర్‌లో గల సర్కిల్-2 ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో ఎక్సైజ్ సూపరండెంట్ సిహెచ్ దాసు నేతృత్వంలో ఈ వావానాల వేలం జరగనుంది. 2015వ సంవత్సరం మోడల్‌కు చెందిన పల్సర్‌ను ప్రారంభ ధర రూ.35వేలుకు, 2012వ సంవత్సరానికి చెందిన హోండా యాక్టివా ప్రారంభ ధర రూ.17వేలుకు వేలంలో ప్రకటించనున్నారు. మంగళవారం ఉదయం 11గంటలకు జరిగే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొన వచ్చని ఎక్సైజ్ సర్కిల్-2 సిఐ కెవి పాపునాయుడు తెలిపారు.

జగన్‌కు సిట్ మరోసారి నోటీసులు
విశాఖపట్నం(క్రైం), నవంబర్ 19: కోడి కత్తి దాడి కేసులో జగన్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆ నోటీసు సారంశం. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైస్ జగన్మోహనరెడ్డిపై వెయిటర్ జె శ్రీనివాసరావు కోడి కత్తెతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ కమిటీ వాంగ్మూలం