క్రైమ్/లీగల్

మహిళ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేస్తవారపేట, మార్చి 6: బేస్తవారపేట మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన వివాహితను తర్లుపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలాల్లో హత్య చేసిన సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. వివరాల మేరకు ఖాజీపురం గ్రామానికి చెందిన నాగమణి (40)ని తర్లుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యచేసి కంభం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఖాజీపురం బేస్తవారపేట పోలీసుస్టేషన్ పరిధి కావడంతో కంభం ఎస్సై రామానాయక్ నిందితుడిని బేస్తవారపేట పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితుడితో కలిసి మృతదేహం ఉన్నప్రాంతానికి వెళ్ళారు. మృతదేహం చూడటానికి భయంకరంగా ఉండటంతో పోలీసులు కష్టంమీద మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
* వివాహేతర సంబంధమే హత్యకు కారణమా ..?
ఖాజీపురం గ్రామానికి చెందిన నాగమణి తర్లుపాడుకు చెందిన వీరయ్యతో గతంలో వివాహమైంది. వీరయ్య శ్రీనివాసులుకు చెందిన ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. ఆ గ్రామంలో నాగమణికి, శ్రీనివాసులుకు వివాహేతర సంబంధం ఏర్పడటంతో విషయం తెలుసుకున్న వీరయ్య అప్పట్లో శ్రీనివాసులు తల్లిని హత్య చేసినట్లు సమాచారం. అప్పటి నుంచి వీరయ్య నాగమణిలు బేస్తవారపేట మండలం ఖాజీపురంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తర్లుపాడుకు చెందిన శ్రీనివాసులు ఖాజీపురంలో ఉన్న నాగమణితో వివాహేతర సంబంధం నెరుపుతూ ఈ హత్యకు ప్రణాళిక రూపొందించుకునాడనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.