క్రైమ్/లీగల్

నకిలీ నోట్లతో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 19 : ఒక పాత నేరస్తుడు రెండు వేల రూపాయల నోట్లను జిరాక్స్‌లు తీసి చెలామణి చేసేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. హైదరాబాద్ పటాన్ చెరువు చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు, దొంగనోట్ల చెలామణిలో పాత నేరస్తుడు. స్థానిక వన్‌టౌన్‌లోని దక్షిణపు వీధిలో గల చిరంజీవి బస్టాండ్ సెంటర్‌లో ప్రసాద్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని తనిఖీ చేయగా స్కానింగ్ చేసిన రెండు వేల రూపాయల నోట్లు 50 నోట్లు, జిరాక్స్ మిషన్ లభించాయని జిల్లా అదనపు ఎస్‌పి కె ఈశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిరాక్స్ నోట్లతో వున్న ప్రసాద్‌ను అరెస్టు చేసి, జిరాక్స్ మిషన్‌ను సీజ్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ప్రసాద్ గతంలో కృష్ణాజిల్లా మండవ పోలీసు స్టేషన్‌లో నకిలీ నోట్ల కేసులో నిందితుడని, ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడని, అనంతరం దొంగనోట్లు చెలామణి చేసేందుకు జిరాక్స్ నోట్లతో సిద్ధమయ్యాడని తెలిపారు. విలేఖరుల సమావేశంలో సిసి ఎస్ డి ఎస్‌పి టి సత్యనారాయణ, టుటౌన్ సి ఐ జి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.