క్రైమ్/లీగల్

సాక్షుల రక్షణ ముసాయిదాకు సుప్రీం ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: సాక్షుల రక్షణకు నేషననల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా)తో కలిసి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలియజేసింది. సాక్షుల రక్షణకు ఉద్దేశించిన ఈ పథక రూపకల్పన పూర్తయ్యిందని, దీనికి చట్టబద్ధత కల్పించే నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వారు దానిని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్‌లు ఏకే సిక్రీ, ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనానికి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ధర్మాసనం ‘దీనిని వెంటనే అమలు చేయాలని మేము రాష్ట్రాలకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తాం’ అని పేర్కొంది. మత బోధకుడు ఆశారాం బాపుపై వచ్చిన అత్యాచారం కేసు విచారణలో సాక్షులకు రక్షణ లేదంటూ గతంలో సుప్రీంలో పిల్ దాఖలైన నేపథ్యంలో ఈ అంశం చర్చకు వచ్చింది. తర్వాత సాక్షుల రక్షణకు ఒక విధానాన్ని అవలంబించాలని వచ్చిన ఆదేశం మేరకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సోమవారం జరిగిన విచారణలో కోర్టు సహాయకారిగా నియమితుడైన న్యాయవాది గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను తయారు చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఎక్కువ రాష్ట్రాల అభిప్రాయాలను ఇందులో పొందుపర్చి నల్సాను సంప్రదించిన తర్వాతే దీనికి తుదిరూపం కల్పించినట్టు చెప్పారు.