క్రైమ్/లీగల్

నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, మార్చి 6: తడలో తప్పుడు ధ్రువపత్రాలు తయారుచేసే ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయ. తడ బజారు సెంటర్‌లో నెట్ సెంటర్ నిర్వహిస్తున్న కొండా బాబు, రాచకండ్రిగకు చెందిన బివి నరేష్, ఎం కుమరేష్, ఎం.చంద్రబాబులతో కలసి గత కొంతకాలంగా నెట్ సెంటర్‌లో ఉన్న కంప్యూటర్ల ద్వారా నకిలీ సర్ట్ఫికెట్లు సృష్టించి పలువురికి అందజేసేవారు. ఈ నకిలీ సర్ట్ఫికెట్ల తయారీపై పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు గత కొంతకాలంగా దీనిపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నెట్ సెంటర్‌కెళ్లి పరిశీలించి వారి వద్దనున్న నకిలీ ట్రాన్స్‌ఫర్ సర్ట్ఫికెట్లు (టీసీ) స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీసిటీ పరిసరాల్లో పరిశ్రమలు వెలువడడంతో ఈ ముఠా యువకులకు వలవేసి ఎటువంటి విద్యార్హత లేకపోయినా 10వ తరగతి చదివినట్లు టీసీ సృష్టించి రహస్యంగా అందజేసేవారు. ఒక్కో సర్ట్ఫికెట్ వెయ్యి నుంచి 2వేల వరకు విక్రయించేవారు. కంపెనీల్లో పదో తరగతి ఉంటే ఉద్యోగం ఇస్తామనడంతో ఈ సర్ట్ఫికెట్లను ఎక్కువగా మహిళలు తీసుకెళ్లి పరిశ్రమల్లో చేరేవారు. అదేవిధంగా అవసరమున్న యువకులకు కూడా కొందరికి అందజేస్తూ దీనిని వ్యాపారంగా మలుచుకున్నారు. ఈ ముఠా గ్రామాలకు సైతం వెళ్లి మీకు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్హత తదితర వంటివి తామే చూసుకొంటామని చెప్పి మాయమాటలు చెప్పి నెమ్మదిగా రంగంలోకి దింపుతారు. అనంతరం పదో తరగతి టీసీ కావాలంటే కొంత ఖర్చవుతుందని చెప్పి వారి వద్ద నుంచి భారీ మొత్తం వసూలు చేసి నకిలీ టీసీ సృష్టించి ఇచ్చేవారు. ఉద్యోగం వస్తుందన్న సంతోషంతో కొందరు అధిక మొత్తంలో కూడా ఈ ముఠాకు నగదు ఇచ్చేవారు. ఇది ఆ నోట ఈ నోట పడి పోలీసుల దాకా వెళ్లడంతో నకిలీ సర్ట్ఫికెట్ల భాగోతం గుట్టు రట్టయ్యింది. ఈ నలుగురిని అదుపులోకి విచారించి పూర్తి సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. వీరి వద్ద విక్రయానికి ఉన్న నకిలీ ధ్రువపత్రాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు.