క్రైమ్/లీగల్

డబ్బు కోసం కుర్రాళ్లకు ఎర...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, నవంబర్ 19: డబ్బు కోసం గొప్పింటి కుర్రాళ్లకు కూతురునే ఎరగా వేశాడు ఓ తండ్రి. దీనికి ఆ కూతురు కూడా పచ్చజెండా ఊపింది. పనె్నండేళ్లకే కూతురు 7వ తరగతి చదువుతుండగానే మొదటి పెళ్లి చేశాడు. ఆ తరువాత మరో పెళ్లి.. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేశాడు. పెళ్లి చేసి ఓ నెల, రెండు నెలలు కాపురం చేసిన తరువాత బంగారం, డబ్బుతో ఉడాయించడం, కొద్ది రోజుల తరువాత మరో పెళ్లి చేయడం.. ఇదీ ఆ తండ్రీకూతుళ్లు కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆట. తన భార్య కనిపించడం లేదని ఐదవ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన కడప జిల్లా పోలీసులు తండ్రీకూతుళ్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు సంగతి వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాకు చెందిన తండ్రీకూతుళ్లు అనంతరెడ్డి, వౌనిక (19)ను కడప జిల్లా ఖాజీపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మైదుకూరు రూరల్ సీఐ కంభగిరి రాముడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోదినాపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డికి భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. బీద కుటుంబానికి చెందిన అనంతరెడ్డి సులభంగా డబ్బు సంపాదించేందుకు కూతురు వౌనికకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కూతురు సైతం అంగీకరించడంతో 12వ ఏటే 7వ తరగతి చదువుతున్నపుడు 2013లో మార్కాపురానికి చెందిన రాముతో పెళ్లి జరిపించాడు. రెండునెలలు కాపురం చేసిన తరువాత వౌనికి తన భర్త వద్ద ఉన్న బంగారం, డబ్బు తీసుకుని తండ్రితో కలిసి పరారైంది. ఆ తరువాత నెల రోజులకే గిద్దలూరు మండలం వేములపాడుకు చెందిన రాజుతో పెళ్లి జరిపించాడు. నెల రోజులు అతడితో ఉన్న వౌనిక డబ్బు, బంగారంతో తిరిగి తండ్రి చెంతకు చేరింది. 2014లో కంభం మండలం బేస్తవారిపేటకు చెందిన శంకర్‌ను పెళ్లి చేసుకుంది. అతనితో 25 రోజులు కాపురం చేసిన తరువాత డబ్బు తీసుకుని తండ్రి చెంతకు చేరింది. ఆ తరువాత తెనాలికి చెందిన గాంధీని పెళ్లి చేసుకుంది. అతనితో రెండేళ్లు కాపురం చేసింది. 2018 ఆగస్టులో కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన రామకృష్ణారెడ్డిని పెళ్లి చేసుకుంది. నెలాఖరులో కూతురును పుట్టింటికి తీసుకువెళ్తున్నానని చెప్పి అనంతరెడ్డి వౌనికను తీసుకుని వెళ్లాడు. వెళ్లేటప్పుడు పది తులాల బంగారం, డబ్బు తీసుకెళ్లింది. నెల రోజులైనా భార్య రాకపోవడంతో రామకృష్ణారెడ్డి అత్తగారింటికి వెళ్లి విచారించగా అక్కడ ఎవరూ లేరని తెలియడంతో ఈనెల 10వతేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన చంటినాయక్‌ను వౌనిక అన్నవరంలో పెళ్లి చేసుకుంది. రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కడప పోలీసులు ప్రకాశం, హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాలను పంపి వౌనిక కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వౌనిక ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. వౌనిక తండ్రి అనంతరెడ్డిని సైతం అరెస్టు చేశారు. వీరిద్దరిని విచారించగా డబ్బు కోసం కూతురుకు పెళ్లిళ్లు చేసినట్లు అనంతరెడ్డి అంగీకరించాడు. డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు సీఐ రాములు, ఎస్‌ఐ రోషన్ ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి తండ్రీకూతుళ్ల గుట్టురట్టుచేశారు. వీరికి సహకరించిన చంటి నాయక్‌ను సైతం అరెస్టుచేశారు. సోమవారం ఖాజీపేటలో వీరి వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.

చిత్రం..నిందితులను మీడియాకు చూపిస్తున్న పోలీసులు