క్రైమ్/లీగల్

యశ్‌పాల్ సింగ్‌కు మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ సిక్కుల ఊచకోతకు సంబంధించి 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్ల కేసులో ఒక దోషికి మరణ శిక్ష, మరో దోషికి జీవిత ఖైదును విధిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీ నగరంలో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మూడు వేల మంది ప్రజలు మరణించారు. ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన కేసులో యశ్‌పాల్ సింగ్‌కు మరణ శిక్ష, నరేష్ షెరావత్‌కు జీవిత ఖైదునువిధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఢిల్లీ అలర్లపై పునర్విచారణ నిమిత్తం నరేంద్రమోదీ ప్రభుత్వం 1915లో సిట్‌ను ఏర్పాటు చసేంది. ఇందులో భాగంగా ఈ కేసులు విచారణ జరిగాయి. సాక్ష్యాధారాలు లేక 1994లో ఈ కేసును ఢిల్లీ పోలీసులు మూసివేశారు. కాగా సిట్ 60 కేసులను విచారించింది. ఇందులో 52 కేసుల్లో సరైన ఆచూకీ లభించడం లేదని పేర్కొంది. శిక్షకు గురైనవారికి రూ. 35 లక్షల జరిమానాను కోర్టు విధించింది. వీరు ఈ సొమ్మును చెల్లించాలని కోర్టు పేర్కొంది. ఈ సొమ్మును ఢిల్లీ అల్లర్లలో వీరి చేతిలో హతమైన హర్‌దేవ్‌సింగ్ అవతార్
సింగ్ కుటుంబాలకు చెల్లించాలని కోర్టు పేర్కొంది. సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా కోర్టు విచారించి మరణ శిక్ష విధించింది. గతంలో ఈ కేసులను విచారించిన కోర్టు కిషోరిఅనే దోషికి మరణశఇక్షను విధించింది. మూడు కేసుల్లో ఢిల్లీ హైకోర్టు దిగువ కోర్టు విధించిన మరణ శిక్షను ధృవీకరించింది. కాగా సుప్రీంకోర్టు ఈకేసులను జీవిత ఖైదుగా మార్చింది. కాగా కోర్టు ఒక దోషికి మరణ శిక్షను, మరో దోషికి జీవిత ఖైదును విధించడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తో పాటు పలువురు స్వాగతించారు.
కాగా మంగళవారం కోర్టు ప్రారంభమైన వెంటనే అదనపు న్యాయమూర్తి అజయ్ పాండే దోషులకు శిక్షలను ఖరారు చేశారు. ఐపీసీ 302 సెక్షన్ కింద ఈ శిక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన దోషి యశ్‌పాల్ సింగ్‌పై కోర్టులో దాడి జరిగింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీర్పును న్యాయమూర్తి తీర్పును చదివారు. తీహార్ జైలులో కోర్టు విచారణ జరిగింది. అక్కడే తీర్పులను ఖరారు చేశారు. మరణ శిక్ష ధృవీకరణ నిమిత్తం కేసుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో జీవిత ఖైదు ఖరారైన దోషి నరేష్ షెరావత్ అనారోగ్యంతో ఉండడంతో మరణ శిక్షను విధించలేదని కోర్టు పేర్కొంది. 1984 నవంబర్ 1వ తేదీన దక్షిణ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హర్‌దేవ్‌సింగ్, అవతార్ సింగ్‌ను దోషులు హత్య చేసినట్లు రుజువైందని కోర్టు పేర్కొంది. దాదాపుదు వందల మందితో కూడిన గుంపు, దోషుల ఆధ్వర్యంలో ఈ సామూహిక దాడికి పాల్పడి చంపేశారని కోర్టు తెలిపింది. 1984 సిక్కుల ఊచకోత అల్లర్లకేసులో 650 కేసులు నమోదయ్యాయి. 267 కేసులను పోలీసులు మూసివేశారు. ఇందులో ఐదు కేసులను సిబీఐ, పునర్విచారణ చేసింది. రద్దయిన 18 కేసులను సిట్ దర్యాప్తుచేసింది. కాగా కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.
చిత్రం..పాటియాలా హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం సంతోషం వ్యక్తం చేస్తున్న బాధితుల కుటుంబ సభ్యులు