క్రైమ్/లీగల్

ఏమిటీ లీకులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: సీబీఐలో డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అభియోగాలపై ఇచ్చిన జవాబు లీక్ కావడంపై సుప్రీంకోరు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మంగళవారం ఉదయం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. అలోక్‌వర్మ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు నారిమన్, గోపాల్ శంకర్ నారాయణన్ మధ్య సమన్వయ లేమి కోర్టుహాలులో బహిర్గతమైంది. మరో వైపు సీబీఐ అధికారి మనోజ్ సిన్హా పిటిషన్‌లోని అంశాలు మీడియాలో ప్రచురితం కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే, సీబీఐ డైరెక్టర్ వర్మపై వచ్చిన అభియోగాలపై సీవీసీ ఇటీవల విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో సీవీసీ పేర్కొన్న అంశాలపై స్పందిస్తూ తన వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ వర్మను ఆదేశించింది. ఈ లేఖను మంగళవారం ఇవ్వాలని కోర్టు గతంలో ఆదేశించింది. కాని కొన్ని మీడియాల్లో ఈ లేఖ వివరాలు ఇవే అంటూ ప్రచురితమయ్యాయి. కోర్టు ప్రారంభమైన వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఒక నివేదికలో వివరాలు గోప్యతగా ఉంచాలని, ఇది అత్యంత ముఖ్యమైన నివేదిక అని తాము చెప్పినా లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఏ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ ఉన్నారు. వర్మ ఇవ్వాల్సిన నివేదికలో అంశాలు లీక్ కావడంపై వర్మ తరఫున న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్‌ను కోర్టు ప్రశ్నించింది. నారిమన్ వాదన వినేందుకు కోర్టు నిరాకరించింది. అనంతరం మళ్లీ వాదన వినేందుకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి ఈ రోజు కోర్టు సెలవుపై వెళ్లి సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను తిరిగి ఆ పదవిలో నియమించడమో లేక సెలవుపై కేంద్రం పంపించడం సమర్థిస్తూ తుది నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. అనంతరం కోర్టు 29వ తేదీకి కేసు విచారణను వాయిదావేసింది. సీబీఐ అధికారి మనోజ్ సిన్హా తన బదిలీని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు సంబంధించి ప్రస్తావించేందుకు కోర్టు నిన్న నిరాకరించింది. కాని అందులోని అంశాలు మీడియాలో ప్రచురితం కావడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఒక లిటిగెంట్ తమ ముందు పిటిషన్‌లోని అంశాలను ప్రస్తావించేందుకు అవకాశం అడిగినట్లే అడిగి, పత్రికలకు విడుదల చేయడమేంటని ప్రధాని న్యాయమూర్తి ప్రశ్నింరు. వ్యవస్థను గౌరవించడం నేర్చుకోవాలని కోర్టు పేర్కొంది. సీబీఐ అధికారి మనోజ్ సిన్హా తన పిటిషన్‌లో ఒక అవినీతి కేసు వివరాలు బహిర్గతం కాకుండా సీవీసీ కేవీ చౌదరి, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ తదితర పేర్లను ప్రస్తావించిన విషయం విదితమే. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే వర్మ న్యాయవాదులు గోపాల్ శంకర్ నారాయణ, నారిమన్‌లో వర్మ కేసును ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జోక్యంచేసుకుని గోప్యత పాటించాలని చెప్పాం, కాని మీడియాలో వర్మ రాసినట్లుగా నివేదికలో అంశాలు ప్రచురితమయ్యాయి. దీనికేమంటారు అని అడిగారు. ఎవరికి వారు కోర్టుకు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పుకుని వెళ్లేందుకు ఇదేమీ ప్లాట్‌ఫారం కాదన్నారు. న్యాయపరమైన హక్కులు, సమస్యల పరిష్కారానికి కోర్టుకు ప్రజలువస్తారు. ఈ వ్యవహారాన్ని సరిదిద్దుతాం అని కోర్టు ప్రకటించింది. మీకు ఈ కేసులోవాదనలు కొనసాగాలని కోరుకుంటున్నారా అని కోర్టు ప్రశ్నించింది. మీడియాకథనం వెలువడిన ప్రతిని న్యాయవాది నారిమన్‌కు కోర్టు ఇచ్చింది. ఇది చూసి మీ అభిప్రాయం చెప్పండని కోర్టు కోరింది. మీరంటే మాకు ఎంతో గౌరవం, మీకు సీనియర్ న్యాయవాది. ఈ కేసులో మీరు కోర్టుకు సహకరించాలి అని కోర్టు పేర్కొంది. ఈ కథనాల ప్రతిని చూసిన తర్వాత నారిమన్ వాదనలు వినిపిస్తూ తాను ఈ ప్రతినిచూసిన వెంటనే కలతకు గురవుతున్నానని, నివేదిక అంశాలకు గుర్తింపు లేదని చెప్పారు. సీబీఐ డైరెక్టర్ వర్మ తరఫున మరో న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ ఈ కేసులో ప్రస్తావించేందుకు సోమవారం అనుమతి అడిగారని చెప్పారు. వర్మ జవాబు ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కోరినట్లు కోర్టు పేర్కొంది.