క్రైమ్/లీగల్

గుట్కా ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, నవంబర్ 20: గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న ఓ ముఠాను ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు గుట్టురట్టు చేశారు. రూ.18 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకోగా, రెండు వాహనాలు సీజ్ చేసి, 11 మందిని అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ వి శ్రీనివాసరావు మంగళవారం విలేఖరులకు వివరాలు వెల్లడించారు. మార్టూరు ఎస్‌ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రైవేటు ట్రావెల్స్ ఆరంజ్ బస్సు, దాని వెనుక సమీపంలో ఒక కారు, ఒక ఆటో, ఒక స్కూటీ ఆటో, కొంతమంది వ్యక్తులు సదరు బస్సులో నుంచి తెల్లటి బస్తాలను తమ వాహనంలో లోడ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, ఎస్‌ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్‌పరాగ్‌లను ఎటువంటి లైసెన్సు లేకుండా బెంగళూరు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆరంజ్ ట్రావెల్స్ ద్వారా ఇక్కడకు తెప్పించుకొని గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అధిక ధరకు అమ్ముకుంటున్నారని డీఎస్‌పి తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నోముల మల్లికార్జున, టి హనుమంతరావు, జయపాల్, హనుమాన్‌దాస్‌రెడ్డి, గుంటూరు రెడ్డిపాలెంకు చెందిన నల్లమల రాజా, పులిగోర్ల వెంకటేశ్వర్లు, గోదా రామాంజనేయులు, కె మునికంఠ, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ సులేమాన్‌బాషా, కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన సంతోష్, మంజునాథ్ మొత్తం 11 మందిని మంగళవారం ఉదయం అరెస్టు చేసి వారి వద్ద నుంచి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆరెంజ్ ట్రావెల్స్ స్లీపర్ ఏసీ బస్సు, ఒక కారు, ఒక ఆటో, స్కూటీలతో పాటు 71 బస్తాల గుట్కా, పాన్‌పరాగ్, 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, కుందురు రామకృష్ణ పరారీలో ఉండగా, త్వరలో అతన్ని కూడా అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.