క్రైమ్/లీగల్

అండమాన్ దీవుల్లో అమెరికా పౌరుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: అండమాన్ నికోబర్ దీవుల్లో ఓ అమెరికా జాతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ సెంటినీల్ ద్వీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన తెగకు చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ తమ పౌరుడు అదృశ్యమైనట్టు ప్రకటించింది. ఇది దురుద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా కేసు నమోదు చేశారు.‘మా పౌరుడు అండమాన్ నికోబర్ దీవుల్లో ఉన్నట్టు సమాచారం అందింది. విదేశాల్లో ఉన్న మా పౌరుల క్షేమం, భద్రతకే మేం అత్యంత ప్రాధాన్యత ఇస్తాం’అని కాన్సులేట్ ప్రతినిధి వెల్లడించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అక్కడి స్థానిక అధికారులదేనని అన్నారు. అమెరికా పౌరుడు జాన్ అలెన్ ఛౌ(27) హత్యకు గురైనట్టు పోర్ట్ బ్లెయర్ నుంచి వెలువడే ఓ ప్రతిక ప్రచురించింది. జాన్ అండమాన్ నికోబర్‌లో పర్యిటించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి ఐదుసార్లు ద్వీపంలో పర్యటించాడు. సెంటినీల్ తెగకు చెందిన గిరిజనులను కలుసుకోవాలన్నది కోరిక. అయితే బయట వ్యకులు ఎవర్నీ ఆ గిరిజనులు దగ్గరకు రానీయరు. ఎలాగైనా అక్కడికి చేరుకోవలని భావించిన జాన్ ఛిడియాటపునుంచి ఓ రబ్బరు పడవలో బయలుదేరి దీవికి చేరుకున్నాడు. ఈనెల 14న దీవికి చేరుకోవాలని ప్రయత్నించినా వీలుపడలేదని పత్రిక వెల్లడించింది. మళ్లీ 16న పడవపైనే అక్కడకి చేరుకున్నాడు. చివరికి ఓ జాలరి వద్ద జాన్ మృతదేహం దొరికింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. జాలరిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవర్నీ సెంటినీల్ గిరిజన ప్రాంతానికి వెళ్లనీయరు. మొత్తం 28 చిన్న దీవుల్లో పర్యటించడానికి వీల్లేకుండా నిషేధం ఉంది.
హత్యకు గురైన జాన్ అలెన్ ఛౌ (ఫైల్)