క్రైమ్/లీగల్

ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ. 39.50 లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 21: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ. 39లక్షల 50వేల రూపాయల కట్టలు బుధవారం పట్టుబడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల, రాజవరం గ్రామాల మధ్య ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిసుండగా హన్మకొండ నుంచి రాజవరం వెళ్తున్న టీఎస్03 ఇటి 5000 నంబరు గల కారుపై అనుమానం రావడంతో స్క్వాడ్ అధికారులు జయంత్, శ్రీనివాస్‌లు ఆ కారును ఆధీనంలోకి తీసుకున్నారు.
రోడ్డుపక్కనే ఆపి కారును సోదా చేయడంతో నోట్ల కట్టలతో ఉన్న సంచి కనిపించినట్లు వారు తెలిపారు. అందులో రూపాయలు 39 లక్షల 50వేలు ఉన్నట్లు వారు తెలిపారు. డబ్బులు తీసుకెళుతున్న కారు యజమాని దేవా సునీల్ వివరణ ఇస్తూ తన మిల్లులో పత్తి కొనుగోలు చేశానని, రైతులకు డబ్బులు ఇవ్వడానికి వరంగల్ లక్ష్మివిలాస్ బ్యాంక్ నుంచి డ్రాచేసిన డబ్బులని తెలిపినప్పటికీ.. ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో, నోట్ల కట్టల సంచితో పాటు కారును స్వాధీనం చేసుకున్న అధికారులు ఘన్‌పూర్ ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకోగా, ఆర్‌ఓ అందుబాటులో లేకపోవడంతో జనగామకు తీసుకెళ్ళగా డీటీవో ఆధ్వర్యంలో పోలీసు కస్టడీకి పంపించినట్లు తెలిపారు.

చిత్రం..తనిఖీలో పట్టుబడ్డ నోట్ల కట్టలు, కారుతో ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు