క్రైమ్/లీగల్

డీసీఎం బోల్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, ఫిబ్రవరి 8: గొర్రెల లోడుతో వెళుతున్న డీసీఎం కల్వర్టును ఢీకొని బోల్తాపడటంతో ఇద్దరు గొర్రెకాపరులు, డీసీఎం క్లీనర్‌లతో పాటు డీసీఎంలోని 56గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున నల్ల గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో చోటుచేసుకుంది. ఘటనలో డ్రైవర్ మేడిపల్లి వెంకటేష్‌కు తీవ్రగాయాల య్యాయి. చిట్యాల సీఐ కె. పాండురంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొల్లపల్లి నుండి ధోనికి కుమారస్వామి(40) సంగెం మండ లం కృష్ణానగర్‌కు చెందిన మేకల మల్ల య్య(36), చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన డీసీఎం క్లీనర్ కొల్లూరు రాకేష్(22) నెక్కొండ సంతలో 105 గొర్రెలను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు డీసీఎంలో గొర్రెలను తీసుకుని పయనమయ్యారు. డీసీఎం చిట్యాల మండలం వెలిమినేడు శివారులోకి చేరుకోగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు రోడ్డుపక్కనున్న కల్వర్టు గోడను ఢీకొనడంతో డీసీఎం కల్వర్టులో పడిపోయింది. కల్వర్టులో డీసీఎం తలకిందులుగా పడిపోవడం తో డీసీఎంలో ఉన్న క్లీనర్ రాకేష్, గొర్రెలకాపరులు కుమారస్వామి, మల్లయ్యలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 56గొర్రెలు కూడా మృత్యువాతపడ్డాయి. సమాచారాన్ని తెలుసుకున్న సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ డి.సైదాబాబులు సిబ్బందితో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలు, గొర్రెలు చెల్లాచెదురుగా పడిన్నాయి. ఘటనలో డీసీఎం డ్రైవర్ వెంకటేష్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాలను పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించి నివాళులర్పించారు.

చిత్రం..వెలిమినేడు శివారులో డీసీఎం బోల్తాపడటంతో మృత్యువాత పడిన గొర్రెలు