క్రైమ్/లీగల్

ఆటో ఢీకొని బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు రూరల్, నవంబర్ 29 : ప్రమాదవశాత్తు ఆటో ఢీకొని రీహాన్ (4) అనే బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని అశ్వనిపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన షరీఫ్, సైదాబేగం దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండవ వాడైన రీహాన్ ఇంట్లో ఆడుకుంటూ రోడ్డుపైకి రావడంతో అటుగా వస్తున్న ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు కుప్పకూలి పోవడంతో హుటాహుటిన ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతిచెందాడని నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి రీహాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.