క్రైమ్/లీగల్

మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 29: రెండు రోజుల క్రితం ఎస్‌కోట మండలం బొడ్డవర పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినిని మీ ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికి నవోదయ పాఠశాల సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లి మానభంగానికి ప్రయత్నించిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సంఘటనకు పాల్పడిన గంధవరపు గోపి పాత నేరస్తుడని, గతంలో ఇతనిపై విజయనగరం వన్‌టౌన్, పెందుర్తి, గుర్ల పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయన్నారు. గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురానికి చెందిన ఈ నేరస్తుడు నాలుగు రోజుల క్రితమే విజయవాడ నుంచి వచ్చారని తెలిపారు. సిసి ఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించామన్నారు. కాగా, నిందితుడిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. ఈ కేసులో డిఎస్పీ సూర్య శ్రావణ్‌కుమార్, ఎస్‌కోట సిఐ వెంకటరావు, ఎస్సై అమ్మినాయుడు, గంట్యాడ పోలీసులను జిల్లా ఎస్పీ పాలరాజు అభినందించారు. వారికి త్వరలో రివార్డులు అందజేస్తామన్నారు. అదే విధంగా ఎ,బి,సి, డి అవార్డులకు పంపుతామన్నారు. ఈ సమావేశంలో ఎఎస్పీ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.