క్రైమ్/లీగల్

స్వామి గౌడ్, సుధాకర్ రెడ్డిల.. ఎన్నికల కేసులో వాదనలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), నవంబర్ 29: శాసనమండలి పట్ట్భద్రుల కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యిర్థిగా పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డిలపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయా కేసులో న్యాయవాదులు పి.వి.రాజ్ కుమార్, సి.విక్రం కుమార్‌లతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంతలు స్పెషల్ మోబైల్ కోర్టు (పిసిఆర్)లో వాదనలు పూర్తి స్థాయిలో గురువారం వినిపించారు. వాదోపవాదాలు విన్న అనంతరం న్యాయమూర్తి రాజు డిసెంబర్ 14న తీర్పు వెల్లడించనున్నారు.ఫిబ్రవరి 2013లో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసిన స్వామి గౌడ్ టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం, సమైక్యవాదుల అభ్యంతరాలను పాతరేద్దాం, తెలంగాణ వాదాన్ని బలపరుద్దాం అంటూ పోస్టర్లు కలెక్టరేట్ కాంపౌండ్‌కు, ట్రాఫిక్ పోలీస్ క్యాబిన్‌కు అంటించగా, స్వామి గౌడ్‌పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అప్పటి కరీంనగర్ తహశీల్దార్‌కు తన ప్రత్యర్థి పిల్లి రాజవౌళి ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు తహశీల్దార్ ఫిబ్రవరిలో ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు చర్య గురించి పంపించారు. ఆయా విషయంలో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ స్వామిగౌడ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని కోరగా, అట్టి నోటీస్‌కు ఎన్నికల అభ్యర్థి తరపున ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్న జి.వి.రామకృష్ణారావు సమాధానం పంపారు. ఆయా సమాధానం సరిగా లేనందున కలెక్టర్ ఆదేశాల మేరకు స్వామి గౌడ్‌పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. ఫిబ్రవరి 2013లో ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డి ఉపాధ్యాయులందరికీ వాయిస్ మేల్ ద్వారా ప్రచారం నిర్వహించారని, 48 గంటల ముందే ప్రచారాన్ని నిలుపుదల చేయాలని ఎన్నికల నియమావళి ఉన్నప్పటికీ సుధాకర్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కేసు నమోదైంది.