క్రైమ్/లీగల్

అదుపు తప్పి సాగర్ కాల్వలో కారు ఫల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, నవంబర్ 29: ప్రమాదవ శాత్తు సాగర్ ఎడమ కాల్వలో మహిళ గల్లంతైన సంఘటన గురువారం మండల కేంద్రంలోని సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మేడం అంజయ్య తన భార్య అనిత (45), కుమారుడు నవీన్‌తోపాటు సమీప బంధువైన డ్రైవర్ కే.శ్రీ్ధర్‌తో కారులో విజయవాడకు బయలుదేరారు. కాగా, అయ్యప్పమాలలు వేసిన అంజయ్య, శ్రీ్ధర్‌లు మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో బిక్ష చేసేందుకు దిగారు. కారులో ఉన్న నవీన్ అనుకోకుండా గేరు వేయడంతో కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నవీన్ ఈదుకుంటూ బయటకు రాగా తన తల్లి అనిత ఆచూకీ తెలియరాలేదు. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట స్థానిక సీఐ శివశంకర్‌గౌడ్‌తోపాటు ఎస్‌ఐ డీ.మహిపాల్‌రెడ్డి ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.