క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, డిసెంబర్ 1: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోను షాద్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రం నుంచి లాల్‌పహాడ్ మీదుగా కొందుర్గు వస్తున్న సమయంలో లాల్‌పహాడ్ వద్ద తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న మద్యం లభించినట్లు ఎక్సైజ్ అధికారిణి సునితా తెలిపారు. 334 మద్యం సీసాలను స్వాధీం చేసుకోవడంతోపాటు ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అక్రమం మద్యం సీసాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని, విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కులకచర్ల: మద్యం సీసాలను తరలిస్తున్న ఆటోను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న సంఘటన కులకచర్ల మండలం కామునిపల్లె శివార్లలో జరిగింది. కులకచర్ల పోలీసుల కథనం ప్రకారం.. కొందుర్గు మండలం గాలిగూడెం గ్రామానికి చెందిన యాదయ్య తన ఆటోలో సుమారు రూ.లక్ష విలువ చేసే మద్య సీసాలను తన ఆటోలో తరలిస్తుండగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం కలిగి ఆటోను తనీఖీ చేశారు. దాంట్లో కులకచర్ల మండల కేంద్రంలోని మద్యం దుకాణం నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఆటో చోదకుడు యాదయ్యపై కేసు నమోదు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తికి రూ. లక్ష విలువ చేసే మద్యం సీసాలను విక్రయించిన మండల కేంద్రంలోని మద్యం దుకాణాదారునిపై కూడా జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు వారు తెలిపారు.
మర్పల్లి1: వికారాబాద్ మర్పల్లి మం డల కేంద్రంలో శనివారంనాడు పోలీ సులు వాహనలు తనిఖీ చేస్తుండగా మద్యం దోరికింది, మర్పల్లి పోలీసులు కథనం ప్రకారం... మర్పల్లి మండలం లాబికుడు గుంట గ్రామానికి చేందిన కృష్ణ అనే వ్యక్తి తన కారులో (ఐదు కా టన్లు ) ఎంసీ మద్యం సీసాలు తీసు కేళ్తుండగా మర్పల్లి గ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేయగా మద్యం దొరికిందని తెలిపారు. మ ద్యం సీసా లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.