క్రైమ్/లీగల్

రూ.1.50 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, డిసెంబర్ 1: మక్తల్, మరికల్ శివారులో పోలీసుల తనిఖీలో శనివారం రూ.1.50 లక్షల నగదు లభించడంతోటి పోలీసులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికుమార్‌కు అప్పగించారు. శనివారం ఉదయం 10-30 గంటల ప్రాంతంలో టిఎస్ 07 యుఈ-7041 నెంబర్‌గల కారులోఅనీల్, సునీల్ అనే హైదరాబాద్‌కు చెందిన అన్నదమ్ములు ఇరువు రూ.1.50లతో మక్తల్ మండలంలోని జక్లేర్‌కు బయలు దేరారు. ఇంతలో మరికల్ శివారులో ఉన్న పోలీసు సిబ్బంది కారును పూర్తిస్థాయిలో తనిఖీచేయగా కారులోని వారితో రూ.1.50 లక్షల నగదు లభించింది. ఈసందర్భంగా పోలీసులు నగదు డబ్బుపై వివరాలు అడుగగా జక్లేర్ గ్రామ శివారులో ఇటుక బట్టీల వద్ద తమ లారీలు ఉన్నాయని, వారికి పేమేంట్ ఇచ్చేందుకై తాము ఈడబ్బులు తీసుకు రావడం జరిగిందని తెలుపడం జరిగింది. ఇట్టి విషయంపై పోలీసులు రశీద్‌ఖాన్, అక్తర్‌ఖఆన్, రాజులు ముగ్గురు కారును, బాధితులను మక్తల్ ఆర్‌ఓ ముందు ఉంచి పంచనామ నిర్వహించి డబ్బులను స్వాదీన పరచుకున్నారు. ఇట్టి డబ్బులను ఎన్నికల అధికారికి పంపనున్నట్లు తెలిపారు. డబ్బులకు సంబంధించి ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరి నుండి తీసుకాన్నారన్న పూర్తి స్థాయి ప్రూప్‌లు సమర్పిస్తే డబ్బులను తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.