క్రైమ్/లీగల్

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందకుంట, డిసెంబర్ 1: వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నకు చివరికి చావే శరణ్యంగా మారుతుంది. తాజాగా మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు పంటపై చేసిన అప్పులతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గూడెపు కిరణ్(30) అనే కౌలు రైతు అదే గ్రామంలో రెండు ఎకరాల భూమిని కౌలు తీసుకొని మొదట పత్తి పంటను సాగు చేశాడు. పత్తి పంటలో నష్టం రావడంతో తిరిగి వేరుశనగ పంటను సాగు చేశాడు. పంటపై చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. పంట దిగుబడి రాకపోవడంతో దిగులు చెందిన రైతు వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ నరేష్‌కుమార్ తెలిపారు.