క్రైమ్/లీగల్

అక్షయ గోల్డ్ ఆస్తుల వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: అక్షయగోల్డ్‌కు సంబంధించిన 300 ఆస్తుల మార్కెట్ విలువను, ప్రభుత్వం నిర్ణయించిన విలువను సీల్డ్ కవర్‌లో పెట్టి ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాన్ని ఆదేశించింది. అక్షయ గోల్డ్ ప్రజలను మోసం చేసిందని, ఈ వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఒక కంపెనీ అక్షయగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ విషయమై ఒక ఇంప్లైడ్ పిటిషన్‌ను కోర్టులో దాఖలై ఉందన్నారు. ఈ కంపెనీకి ఉన్న ఆస్తులు, అప్పుల జాబితాను ఆసక్తి ఉన్న ఒక కంపెనీ తయారు చేసిందన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో ఈ కంపెనీని టేకోవర్ చేసే కంపెనీ తన గుర్తింపును చెప్పిందని, కాని అక్షయగోల్డ్ విషయంలో ఆసక్తి ఉన్న కంపెనీ తన గుర్తింపును ఎందుకు వెల్లడించడంలేదని హైకోర్టు అడిగింది. టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ తన వివరాలు చెప్పకుండా సొమ్మును డిపాజిట్ చేసేందుకు కోర్టు అంగీకరించదని హైకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్లకు వారి డిపాజిట్లను చెల్లించే విధానాన్ని పర్యవేక్షిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషనర్లు కూడా అక్షయగోల్డ్ కంపెనీ ఆస్తుల మార్కెట్, ప్రభుత్వ విలువలను అంచనా వేసి తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.