క్రైమ్/లీగల్

క్రిస్టియన్ మైఖేల్‌కు సీబీఐ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. దుబాయి నుంచి మైఖేల్‌ను మంగళవారం రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. బుధవారం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. క్రిస్టియన్ మైఖేల్‌కు బెయిల్ కోసం పాటియాలా కోర్టులో ఆయన న్యాయవాది పిటిషన్ వేశారు. ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని, విచారణ సమయంలో దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. 3,600 కోట్ల రూపాయల డీల్‌కు సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాలని సీబీఐ తరఫున్యాయవాది కోర్టును తెలిపారు. మైఖేల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు.
కుంభకోణం వెనక...
మూడువేల ఆరొందల కోట్ల రూపాయలతో వీవీఐపీ హెలీకాప్టర్లు కొనుగోలుకు సంబంధించి 1999 కేంద్రం ఓ ప్రతిపాదన చేసింది. అప్పటి వరకూ రష్యాకు చెందిన ఎంఐ-80ఎస్ వినియోగంలో ఉండేది. దానికంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోరూపొందించిన చాపర్లు కొనుగోలుకు నిర్ణయించారు. రాష్టప్రతి, ప్రధాన మంత్రి, ఉపరాష్టప్రతి, రక్షణ మంత్రులు ప్రయాణించేందుకు అనువైన, సురక్షితమైన చాపర్‌లు సమకూర్చాలని భారత వైమానికి దళం భావించింది. రాత్రిళ్లు, ప్రతికూల వాతావరణంలోనూ గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చేందుకు ఎంఐ-80ఎస్ స్థానే వీవీఐపీ హెలీకాప్టర్లు కొనుగోలుకు ప్రతిపాదించారు. ఎబీ వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గ్లోబర్ టెండర్లు ఆహ్వానించింది. 12 హెలీకాప్టర్లకు సంబంధించి 2002 మార్చిలో ప్రతిపాదనలు పంపగా, నాలుగు కంపెనీలు స్పందించి ముందుకొచ్చాయి. సాంకేతిక నిపుణుల కమిటీ మూడు కంపెనీలను ఎంపిక చేసింది. ఫ్లెయింగ్ టెస్ట్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే పోటీదారుగా ఉన్న అగస్టావెస్ట్‌లాండ్ కంపెనీ మూ ల్యాంనకు హాజరుకాలేదు. 6000 ఎం ఇవాల్యూషన్‌కు పాల్గొనలేదు. కాగా ఫ్లయిట్ ఇవాల్యూషన్‌లో ఈసీ-225 యూరోకాప్టర్ అర్హత పొందింది. ఫ్రాన్స్ చెందిన ఈ కంపెనీ ఎంపికైంది. వాజపేయి ప్రిన్సిపల్ సెక్రెటరీ సమక్షంలో 2003 నవంబర్ 19న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీవీఐపీ హెలీకాప్టర్ 6000 ఎం ఎత్తులో ఎగిరే సామర్థ్యం నుంచి 4500 ఎంకు తగ్గించడం, సింగిల్ వెండర్ సమస్యతోపాటు మలు మార్పులు సూచించారు. ఐఏఐ చీఫ్‌కు దీనికి సంబంధించి అదే ఏడాది డిసెంబర్ 23న ప్రిన్సిపల్ సెక్రెటరీ లేఖ రాశారు. వీవీఐపీ చాపర్ల ఎంపికకు సంబంధించి ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్‌పీజీ, పీఎంవోను సంప్రదించలేదని లేఖ సారాంశం. సీలింగ్ తగ్గింపులో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాగా 2010లో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వం హెలీకాప్టర్ల ఒప్పందంపై సంతకం చేసింది. అంతకు ముందు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలొచ్చాయి. హెలీకాప్టర్ల కొనుగోలుకు మరో ప్రతిపాదన చేశారు. సికొర్‌స్కే(రష్యా), యుఎస్ కంపెనీ అగస్టావెస్ట్‌లాండ్, యుకేకు చెందిన రొసోబొరొనెక్ట్స్‌పోర్ట్ కంపెనీలు ముందుకొచ్చాయి. చివరికి అగస్టా, సికొర్‌స్కేలు రంగంలో పోటీలో నిలిచాయి. యుఎస్, యూకేలో పరీక్షలు నిర్వహించగా అగస్టావెస్ట్‌లాండ్ చాపర్లు ఎంపికయ్యాయి. 6000ఎం నుంచి 45000 ఎంకు సీలింగ్ తగ్గింపువిషయంలో గోల్‌మాల్ చేటుచేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి భారత వైమానిక దళం చీఫ్ ఎస్‌పీ త్యాగి ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగం. ఐఏఎఫ్ గట్టిగా వ్యతిరేకించినా త్యాగి వత్తిళ్ల మేరకే మార్పులు చోటుచేకున్నట్టు తెలిసింది. ఎస్‌పీ త్యాగి ఆయన కజిన్స్ రాజీవ్, సందీప్, జూలీకి ముడుపులు ముట్టినట్టు కేసు నమోదైంది. ఈ కుంభకోణంలో ముగ్గురు మధ్యవర్తులు క్రిస్టియన్ మైఖేల్, గుడో హస్కే, కార్లోస్ గెరోసా కీలక పాత్ర పోషించారు. క్రిస్టియన్ మైఖేల్‌కు 42.27 మిలియన్ యూరోలు ముట్టినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. ఫిన్‌మెక్కానికా, అగస్టా కంపెనీల నుంచి త్యాగికి ముడుపులు అందినట్టు సీబీఐ పేర్కొంది. మైఖేల్‌కు త్యాగికి ఉన్న సంబంధాలపై సీబీఐ ఆరా తీయనుంది. ఇలా ఉండగా యుపీఏ పెద్దలు, గాంధీ కుటుంబం పాత్ర ఉందని ఒప్పుకోవలని సీబీఐ తనను వత్తిడి చేస్తోంది మైఖేల్ ఆరోపించారు. యుపీఏ పెద్దలను ఇరికించే ప్రయత్నం జాతీయ దర్యాప్తు సంస్థ చేస్తోందని ఆయన తెలిపారు. 2012లో సీబీఐ కేసు నమోదుచేయగా మైఖేల్ భారత్ వదలి వెళ్లిపోయారు. ఆయన విచారణకు సహకరించలేదని సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. 2017 ఫిబ్రవరిలో ఆయనను దుబాయిలో అరెస్టు చేశారు. మంగళవారం భారత్‌కు తీసుకొచ్చారు.