క్రైమ్/లీగల్

ఉరి వేసుకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, డిసెంబర్ 5: కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని రేకుర్తి విజయపురి కాలనీకి చెందిన బోయిని అంజయ్య (38) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు కొత్తపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ బుధవారం తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మనసికంగా ఇబ్బంది పడేవాడని తెలిపారు. ఈ నెల 3వ తేదిన బయటకు పోయి వస్తానని చేప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రెండు రోజులుగా వెతుకుతున్నారని బుధవారం రేకుర్తి సమ్మక్క గుట్ట వద్ద ఎవరో ఉరి వేసుకొని మృతి చెందన విషయం తెలుసుకొని మృత దేహం వద్దకు వెళ్లి చూడగా బోయిని అంజయ్యగా గుర్తించి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో నేతన్న మృతి
-ఆత్మహత్యా.. గుండెపోటా?

సిరిసిల్ల, డిసెంబర్ 5: సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్ కార్మికవాడలో జక్క పాండు(35) అనే నేత కార్మికుడు మృతి చెందాడు. అప్పుల బాధతో బుధవారం మృతి చెందిన పాండు ఉదంతంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడనే వాదన వినిపిస్తూండగా, చేనేత జౌళి శాఖ అధికారులు మాత్రం దీనిపై స్పందించలేదు. పోలీసులు పాండు మృతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మరో వైపు సిరిసిల్లలో బుధవారం అపద్ధరమ్మ మంత్రి కె.తారకరామారావు ఎన్నికల ప్రచారం, రోడ్డు షో ఉండడంతో పాండు మృతిపై ఎలాంటి విచారణ లేకుండానే త్వరగా అంత్య క్రియలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో దీనిపై వీరు కేసు నమోదు చేయలేదు. కాగా పాండుకు పది జోడీల మరమగ్గాలున్నాయని, సరిగా పని చేయకపోవడం, మద్యానికి బానిస కావడంతో ఆయన అప్పుల పాలైనట్టు చెబుతున్నారు. మంగళవారం రాత్రి పాండు మద్యం సేవించి వచ్చి పడుకున్నాడని, బుధవారం శవమై ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య రూప, కూతురు వైష్ణవి(07), కుమారుడు గణేశ్(01)లు ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల వేళ పవర్‌లూం కార్మికుడు మృతి చెందడంతో అప్పుల బాధతో ఆయన తనువు చాలించాడనే అభియోగంపై రాజకీయ నాయకులు, కొందరు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు పాండు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొంత రాజకీయ కలకలం చెలరేగింది. బీఎస్పీ అభ్యర్థి ఆవునూరి రమాకాంత్‌రావు పద్మనగర్‌లోని పాండు ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలో నేతన్నలకు బతుకమ్మ చీరల పేరుతో ఎలాంటి ప్రయోజనం జరుగడం లేదని, బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణగా మిగిల్చిందన్నారు. సిరిసిల్లలో కేవలం నలుగురైదుగురి చేతితో బతుకమ్మ చీరెలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్ల పథకాలు బందీ అయి ఉన్నాయని, నేతన్నల పేరుతో వారే లబ్దిపొందుతున్నారని అన్నారు.