క్రైమ్/లీగల్

సముద్రస్నానానికి వెళ్లి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాలటౌన్, డిసెంబర్ 6: సముద్రస్నానానికి వెళ్లి అలల తాకిడికి కొట్టుకొని పోయి వ్యక్తి మృతిచెందిన సంఘటన వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఈపూరుపాలెం ఎస్సై అనూక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చీరాల మండలంలోని తోటవారిపాలెం పంచాయతీ భావనారుషి పేటకు చెందిన పల్లెపు వీరేంద్రనాథ్ (35) కుటుంబసభ్యులతో కలిసి వాడరేవు సముద్ర స్నానానికి వెళ్లాడు. వారి కుటుంబంతోపాటు మరో మూడు కుటుంబాల వారు కూడా కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. వీరేంద్రనాథ్ కుటుంబసభ్యులతో కలిసి స్నానం చేస్తూ ఎక్కువ లోతు నీళ్లలోకి వెళ్లి అలల తాకిడికి కొట్టుకుపోయాడు. భార్యాపిల్లలు చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వెనువెంటనే మృతదేహం మునిగిన చోటకే ఒడ్డుకు చేరుకుంది. వీరేంద్రనాథ్ శుభకార్యాలకు వంటచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వివరాలు సేకరించి మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పచ్చళ్ల తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు
చీరాల, డిసెంబర్ 6: పట్టణంలోని కారం, పచ్చళ్లు తయారీ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి గురువారం కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ సిఐ టిఎక్స్ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు, స్థానిక పాపరాజుతోటలోని రామస్తంభం సమీపంలో దేవీశ్రీ పికిల్స్, ఈపూరుపాలెంలోని సుజాత ప్రొవిజన్స్ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి వారి వద్ద అనధికారికంగా తయారుచేసి నిల్వ ఉంచిన పచ్చళ్లు, కారం ముడి సరకు లభించింది. ఈ సందర్భంగా తయారు చేసే ముడిసరకు శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా నాణ్యత పాటించకుండా తయారు చేస్తున్న నారాయణ శ్రీనివాస్, బూదాటి జగదీష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో ఆడిటర్ శ్యామ్‌పాల్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వీర్రాజు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో నకిలీ వేబిల్లుల వ్యక్తులు
మార్టూరు, డిసెంబర్ 6: మండలంలో కొంతమంది వ్యక్తులు దొంగ వేబిల్లులతో గ్రానైట్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారనే అనుమానంతో 25 మంది వ్యాపారులను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇది గోప్యంగా ఉంచడంతో స్థానిక వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదిఏమైనా ఇటీవల కాలంలో దొంగ వేబిల్లులతో గ్రానైట్ వ్యాపారం కొంతమంది నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం మాత్రం వాస్తవమనేది ప్రజలు, అధికారుల దృష్టిలో ఉంది.