క్రైమ్/లీగల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, డిసెంబర్ 7: మండల పరిధిలోని విలియంకొండ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కర్నూల్ నుండి కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో లారీని వెనుక నుండి ఢీకొట్టగా సరస్వతి (50) అక్కడికక్కడే మృతిచెందింది. అందులో శ్రీ్ధర్‌శర్మ, శ్రీనివాసశర్మ, రాధారాణి అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలు రాజేంద్రనగర్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన వారని , శ్రీ్ధర్‌శర్మ భార్య అని ఎస్ ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుగుతున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
* అడ్డాకులలో ఓటు వేయడానికి వస్తూ.. మహిళ దుర్మరణం
అడ్డాకుల: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓటు వేసేందుకు కారులో వెళ్తున్న మహిళ ఉమాదేవి (55) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరోకరు తీవ్ర గాయాలతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన ఉమాదేవి తమ దగ్గరి బంధువులతో సొంతూరికి ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి కారులో వస్తున్నారు. అడ్డాకుల సమీపంలో ముందు వెళ్తున్న లారీ వెనుక కారు తగిలింది. కారు ముందు సీట్లో కూర్చున్న ఉమాదేవి తలకు రక్షస్రావమై సీట్లోనే ప్రాణాలు వదిలింది వెనుక సీట్లో ఉన్న వేణుగోపాల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అంబులేన్స్ లో ఎస్‌వీఎస్ అస్పత్రికి తరలించారు.కారు సీట్లో ఇరుక్కున ఉమాదేవిని స్థానికులు అర గంటపాటు పాటు శ్రమించి బయటకుతీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని జిల్లా అస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ పేర్కొన్నారు.
* అచ్చాయపల్లి స్టేజ్ సమీపంలో ఒకరి మృతి
మూసాపేట: మండల పరిధిలోని అచ్చాయపల్లి స్టేజ్ సమిపంలో శుక్రవారం హైదారబాద్ నుండి కర్నుల్ వేళ్తున్న ఎపి09టివిఎ0716 నంబర్ గల ఇండికా కారు తెల్లవారు జమున డైవర్ నిద్రమత్తుతో అదుపు తప్పి డివైడర్‌ను డికోట్టిన కారు గటనలో డైవర్ షేక్‌షహర్‌భాషా 22 అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి తివ్రగాయ్యలయ్యవని మూసాపేట ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపారు.