క్రైమ్/లీగల్

దాసరిపల్లిలో రూ. 7.50 లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 7: నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో రూ.7.50లక్షల రూపాయల నగదును పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. దాసరిపల్లిలో ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో నగదు డంప్ అయిందని తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లోకి దూసూకెళ్లి నగదును పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన నర్సంపేటలో కలకలం రేపింది.