క్రైమ్/లీగల్

ఆటో, ఐచర్ ఢీ.. ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, డిసెంబర్ 8 : మండల పరిధిలోని రామరాజుపేట గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న సూర్యనారాయణమ్మ (67) అక్కడిక్కడే మృతి చెందగా, ఓబులేసు (26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామానికి చెందిన సూర్యనారాయణమ్మ, తులశమ్మ, సువర్ణమ్మ, వరలక్ష్మి, నందయ్య, రామలక్ష్మి, సుంకులు, చిన్నవెంకటరెడ్డి, ఓబులేసు, రామలక్ష్మి, గౌరమ్మ, పద్మనాభరాజు, తదితరులు భజన చేసేందుకు శుక్రవారం రాత్రి ఆటోలో గార్లదినె్న మండలం కనుంపల్లిలో వెలసిన నల్లమ్మ ఆలయానికి వచ్చారు. రాత్రికి భజన చేసి శనివారం తెల్లవారుజామున స్వగ్రామానికి ఆటో బయలుదేరారు. ఆటో రామరాజుపేట సమీపంలోకి రాగానే అగ్ని పెట్టెల లోడుతో వెళ్తున్న ఐచర్ ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మిగిలిన 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను 108 ద్వారా అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మడకశిర వాసి మృతి
మడకశిర, డిసెంబర్ 8 : కర్నాటక ప్రాంతం దొమ్మితిమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మడకశిర ప్రాంతానికి చెందిన నారాయణప్ప (50) మృతి చెందాడు. హనుమప్ప తీవ్రగాయాలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మడకశిర మండలం టీడీపల్లికి చెందిన నారాయణప్ప, హనుమప్పలు ద్విచక్ర వాహనంలో కర్నాటక దొమ్మితిమర్రి పరిధిలో ఉన్న గ్రామాల్లో పాడి పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని కొనుగోలు చేయడానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొనడంతో నారాయణప్ప అక్కడికక్కడే మృతి చెందగా హనుమప్ప కాలు దెబ్బతిని తీవ్ర గాయాలకు గురయ్యాడు. మృతి చెందిన నారాయణప్పకు భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.