క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి యువకుని బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 8: తన రెక్కల కష్టంతోకుటుంబాన్ని పోసిస్తున్న ఆ యువకుడు కనురెప్పపాటులో జీవనాదారమైన కేబుల్ తీగలు విద్యుత్‌వైర్లకు తగిలి మృత్యువు కబలించింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి మండలం గెద్దపేట గ్రామానికి చెందిన ఇల్లాపు రమేష్(35) గత కొంతకాలంగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. జీవనాధారంగా గెద్దపేట, వేమలి, పిడిశీల, తదితర గ్రామాలలో కేబుల్‌నెట్ వర్కు నిర్వహిస్తున్నాడు. అయితే మండంలోని వేమలి గ్రామంలో కేబుల్ సరపరాలో అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య పరిష్కరించేందుకు శుక్రవారం వేమలి-ముచ్చర్ల గ్రామాల మధ్య ఓ తోట సమీపంలో కేబుల్‌వైర్లు కలిపేక్రమంలో విద్యుత్‌వైర్లకు తగిలి విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఒంటరిగా వెళ్లిన రమేష్ తిరిగి ఇంటికి సాయంత్రం అయినా రాకపోవడంతో భార్య సుజాత ఆందోళనకు గురై సెల్‌కు పోను చేసినప్పటికి స్పందరాకపోవడంతో గ్రామాలలో ఆరా తీశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వేమలి గ్రామంలో తన ద్విచక్ర వాహనం గుర్తించి పరిసర ప్రాంతాలలో ఆరాతీయగా నిజ్జీవంగా శవమై కనిపించారు. స్ధానికుల సమాచారం మేరకు స్ధానిక ఎస్ ఐ జె.తారకేశ్వరరావు మృత దేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రమేష్‌కు కుమార్తె చర్మిష్, కుమారుడు తేజన్య ఉన్నారు. రమేష్ మృతితో గెద్దపేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
వ్యక్తిపై చెక్కతో దాడి
తెర్లాం, డిసెంబర్ 8: సింహాచలంపై దాడిన వ్యక్తిపై కేసు నమోదుచేశామని ఎస్ ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఎస్‌ఐ అందించిన వివరాల ప్రకారం మండలం సుందరాడ గ్రామంలోని మంగలి కూలానికి చెందిన సింహాచలం శనివారం ఓ హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన దాకరపు రాజేష్ అనే వ్యక్తి చెక్కతో దాడిచేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే గాయపడిన సింహాచలంను తెర్లాం పిహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేసి అక్కడ నుంచి బాడంగి సిహెచ్‌సికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారన్నారు. సింహాచలం భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.