క్రైమ్/లీగల్

రాజీయే రాజమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్కలి, డిసెంబర్ 8: జాతీయలోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో వున్న కేసులను రాజీ మార్గంలో పరిష్కారించుకోవడం రాజమార్గమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిశ్రీ అన్నారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్, న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షిదారులు కేసులను సత్వరం పరిష్కారించుకోవడంతో ఆర్థికంగా, సమయం కూడ వృధాకాకుండా కాపాడుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ ఆసోషియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు కృష్ణారావు, వివేకానంద, పి.బాబురావు, వైకుంఠరావుపాణిగ్రాహి, పైల అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఖైనీ గుట్కాలు పట్టివేత
కొత్తూరు, డిసెంబర్ 8: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రెండు లగేజీ బ్యాగ్‌లతో తరలిస్తున్న ఖైనీ గుట్కాలను ఎస్ ఐ రవికుమార్ పట్టుకున్నారు. రాజాంకు చెందిన ఊణ్ణ రమేష్ అనే వ్యాపారి ఒడిశా నుంచి నిత్యం ఖైనీ, గుట్కాలను అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా వీటిని పట్టుకున్నారు. రూ.5 వేలు విలువ చేసే వీటిని పట్టుకొని రమేష్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.