క్రైమ్/లీగల్

చిత్తూరు జిల్లాలో 2109 కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు , డిసెంబర్ 8: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లా కోర్టులో ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయమూర్తి వౌలానా ఇతర న్యాయమూర్తులు స్వయంగా పర్యవేక్షించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రంమలో భాగంగా కేసులు విచారణ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 27 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సివిల్, క్రిమినల్ , బీమా, బ్యాంకులు, రోడ్డు ప్రమాదాలు, తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలోని అన్ని కోర్డులు కక్షదారులతో నిండిపోయాయి, దీర్ఘకాలంగా కేసుల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి కక్షదారులు మక్కువ చూపడంతో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 2109 కేసులను పరిష్కరించి బాధితులకు రూ 9.76 కోట్లను నష్టపరిహారంగా అందజేసారు.