క్రైమ్/లీగల్

పేలిన నాటు తుపాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం శేరీదింటకుర్రు గ్రామంలో శనివారం నాటు తుపాకీ పేలి 8వ తరగతి విద్యార్థి చిటికెనేని కరుణానిధి (14) దుర్మరణం పాలయ్యాడు. చేపల చెరువుల వద్ద కాపలా ఉంటున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన చిన్నా గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలతో కలిసి తన దగ్గరున్న నాటు తుపాకీతో పక్షులను చంపి వాటిని మంటలో కాల్చుకుని తింటున్న సమయంలో చిన్నా చేతిలో తుపాకీ అకస్మాత్తుగా పేలింది. తుపాకీ నుండి నిప్పురవ్వలు కరుణానిధి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు చిన్నా వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.