క్రైమ్/లీగల్

కత్తిపోట్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నల్లకుంట, డిసెంబర్ 8: మద్యం మత్తులో ఉండి ఇద్దరు వ్యక్తుల మధ్య చేలరేగిన సంఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన అంబర్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ కథనం ప్రకారం.. గోల్కానాలోని జిందాతిలస్మాత్ ప్రాంతానికి చెందిన షాహిద్ (26), ఖాధ్రిభాగ్ ప్రాంతానికి చెందిన అన్వర్ అలియాస్ అన్ను (45)లు కలిసి శనివారం మధ్యాహ్నం మద్యం సేవించారు. అంబర్‌పేట్ ఛే నంబర్ రోడ్డులోని పాన్‌షాప్ వద్దకు వెళ్లి సిగరేట్ తాగిన అనంతరం అన్వర్ మరింత మద్యం తాగాలని షాహిద్‌ను బతిమిలాడినాడు. దీంతో షాహిద్ తన వద్ద డబ్బులు లేవని అనండంతో కోపోద్రిక్తుడైన అన్వర్ పక్కనే ఉన్న బీర్ బాటిల్ సీసాతో దాడి చేసి గాయపరిచారు. రక్తం మడుగులో పడి ఉన్న షాహిద్‌ను స్థానికులు 108లో చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు అందోళన చెందారు.