క్రైమ్/లీగల్

కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, డిసెంబర్ 8: జమ్మూకాశ్మీర్‌లో పూంచ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 13 మంది దుర్మరణం చెందారు. 17మంది గాయపడ్డారు. 42 సీటర్ల ప్రయాణికుల బస్సు మండి ప్రాంతంలోని ప్లేరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు లోరాన్ నుంచి పూంచ్‌కు వెళ్తుండగా అదుపుతప్పి లోయలోపడిపోయిందని పోలీసులు వెల్లడించారు.
మలుపువద్ద డ్రైవర్ బస్సును అదుపుచేయలేకపోయాడు. ఆరుగురు ప్రమాదం స్థలంలోనే చనిపోయారు. ఐదుగురిని అసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మిగతా ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారని వారన్నారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారిని మెరుగైన వైద్యం కోసం హెలీకాప్టర్‌లో జమ్మూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
చిత్రం.. జమ్మూలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనా స్థలంలో
ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్న జవానులు