క్రైమ్/లీగల్

ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, డిసెంబర్ 9: ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు తూర్పు గోదావరి జిల్లా చింతూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ ఎదుట ఆదివారం లొంగిపోయారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..దెయ్యాలవాయి గ్రామానికి చెందిన కొవ్వాసి చోకే, జిల్లేడుగుంపు గ్రామానికి చెందిన మడకం లచ్చు, మడకం సింగయ్యలు మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించేవారు. 2016లో ఈ ముగ్గురు మావోయిస్టు శబరి ఏరియా కమిటీలో చేరారు. మావోయిస్టులకు నిత్యావసర సరుకులు, మందులు సరఫరా చేసేవారని, అలాగే మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనేవారని డిఎస్పీ తెలిపారు. గ్రామాల్లో పర్యటించే పోలీసుల సమాచారాన్ని ఈ ముగ్గురు ఎప్పటికప్పుడు మావోయిస్టులకు అందజేసేవారన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలను గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసుల పిలుపుమేరకు ఈ ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగిపోయారని డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు. లొంగిపోయిన ఈ మిలీషియా సభ్యులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.

చిత్రం.. లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులతో డీఎస్పీ దిలీప్ కిరణ్, అధికారులు