క్రైమ్/లీగల్

15 కిలోల బంగారు నగలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం, డిసెంబర్ 9: ఓ బస్సులో 15 కిలోల బంగారు నగలు అహరణకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన సంజయ్, కేదార్ తయారుచేసిన నగలను దేశవ్యాప్తంగా పలు బంగారు దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఈక్రమంలో బెంగళూరులోని బంగారు నగల దుకాణానికి 15 కిలోల బంగారు నగలు సరఫరా చేయడానికి శనివారం వైజాగ్ నుంచి ఒక ప్రైవేట్ బస్సులో వీరు బయలుదేరారు. ఈనేపథ్యంలో బెంగళూరుకు వెళుతున్న బస్సు శనివారం ఉదయం అల్పాహారం కోసం బంగారుపాళ్యం సమీపంలోని ఒక హోటల్ వద్ద బస్సును డ్రైవర్ ఆపాడు. ఆ సమయంలో టిఫిన్ చేయడానికి కేదార్ బస్సు దిగి తరువాత టిఫిన్ తిని తిరిగి బస్సు ఎక్కి చూడగా బస్సులో ఉంచిన నగల బ్యాగ్ కన్పించలేదు. దీంతో బస్సులో ఉన్న సంజయ్‌ను అడగ్గా తాను నిద్రపోయానని, తనకు ఏమీతెలియదని చెప్పాడు. అనంతరం వీరిద్దరు అదే బస్సులో బెంగళూరుకు వెళ్లి అక్కడ నగల వ్యాపారికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం రాత్రి ముంబైకి చెందిన నగల వ్యాపారి దావే బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు ఇన్‌చార్జి డీఎస్పీ రామ్‌కుమార్ పరిశీలించి విచారణ చేపట్టారు. కాగా బంగారాన్ని తీసుకెళ్లే వ్యక్తులు అజాగ్రత వల్ల ఈ చోరీ జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.