క్రైమ్/లీగల్

ఆర్మీ జవాన్‌కు 14 రోజుల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 9: సంచలనం సృష్టించిన బులంద్‌షహర్ మూకదాడి ఘటన సందర్భంగా పోలీసు ఇన్స్‌పెక్టర్ సుబోద్‌కుమార్ సింగ్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన ఆర్మీ జవాన్‌కు జుడిషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల జైలుశిక్ష విధించారు. అలాగే ఈ కేసులో వివాదాస్పదంగా మారిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రరుూస్ అక్తర్‌పై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఇలావుండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్ జితేంద్రమాలిక్‌ను ఆర్మీ అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందానికి అప్పగించగా క్రైం బ్రాంచ్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తారు. తర్వాత జిల్లా అస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టగా జవాను జితేంద్రమాలిక్‌కు రెండు వారాల జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈనెల 3న ఓ గోవును చంపిన ఘటనకు సంబంధించిన చెలరేగిన అల్లర్లలో ఇన్స్‌పెక్టర్ సుబోద్ కుమార్ సింగ్‌తోబాటు 20 సంవత్సరాల యువకుడు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ అనుమానాస్పద మృతుల విషయంలో తర్వాత కేసు పలుమలుపులు తిరిగింది. కాగా ఏఎస్పీ అక్తర్‌ను లక్నోలోని పీఏసీ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశామని, ఆయన స్థానంలో మనీషామిశ్రాను గజియాబాద్ మోడ్రన్ కంట్రోల్‌రూం ఏఎస్పీగా నియమించామని ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) అరవింద్‌కుమార్ తెలిపారు.