క్రైమ్/లీగల్

మిచెల్‌కు రిమాండ్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులు మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్‌కు మరో ఐదురోజుల రిమాండ్ పొడిగించారు. సోమవారం మిచెల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. మిచెల్ విచారణకు సహకరించడం లేదని అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో మరో ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. తన క్లయింట్ వద్ద ఎలాంటి సమాచారం లేదని, విచారణ అధికారులూ ఏమీ రాబట్టలేకపోయారని క్రిస్టియన్ తరఫున్యాయవాది వాదించారు. ఆయన కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మరోపక్క ఇంతకు ముందు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న మిచెల్ తాజాగా మరోదాన్ని దాఖలు చేశారు. యూకే పౌరసత్వం ఉన్న క్రిస్టియన్‌ను ఈనెల 4వ తేదీ రాత్రి భారత్‌కు తరలించారు.