క్రైమ్/లీగల్

కృష్ణా ట్రిబ్యునల్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపుకోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు తెలుగు రాష్ట్రాల మధ్యనే విభజన చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర కర్ణాటకకు గతంలో నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులకు విఘాతం కలిగించకుండా ఏపీ, తెలంగాణకు నీటి పంపకాలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేవించింది. పొడిగించిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోటు కృష్ణానదీ పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకను చేర్చి, మొదటి నుంచి కేటాయింపులు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్‌గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని గతంలో తీర్పునించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏ.పీ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌లో మళ్లీ మొదటి నుంచి నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరిపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కోట్టి వేసిందని ధర్మాసనం గుర్తు చేస్తూ ‘ఈ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చుతున్నాం’అని ప్రకటించింది.