క్రైమ్/లీగల్

మీరెలా సవరణలు చేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భూసేకరణ చట్టం-2013కు సవరణలు ఎలా చేస్తారంటూ ఐదు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. చట్టానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, జార్ఖంఢ్ ప్రభుత్వాలు సవరణ చేశాయి. ఈ సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. సవరణలు చట్టాన్ని నీరుగార్చేవిధంగా ఉన్నాయని సామాజికవేత్త మేధాపాట్కర్ ఈ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, దీపక్‌గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున సినీయర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు చేశారు. నిర్వాసితులకు ఉపాధి భద్రత కల్పించకుండా, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేశారని ఆయన ఆరోపించారు. సామాజిక ప్రభావ మదింపుఅంచనా వేయకుండా భూసేకరణ జరపడం కేంద్ర చట్టానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి తూట్లుపొడిచేలా ఆయా రాష్ట్రాలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన కోర్టు దృష్టికి తెచ్చాం. రైతులు, భూ యజమానుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా చట్టానికి సవరణలు చేశారని ఆరోపించారు. జీవనోపాధి అనే ప్రాథమిక హక్కును హరించే విధంగా సవరణ చేసేసుకున్నారని ధర్మాసనానికి వివరించారు. ఈ సవరణలలో భూసేకరణ కింద తీసుకున్న భూమిని సేకరించి ఉపయోగించకుండా తిరిగి వెనక్కి ఇచ్చే నిబంధనను తొలగించాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు. భూసేకరణ చట్టానికి ఆయా రాష్ట్రాలు చేసిన సవరణలను కోర్టుకు న్యాయవాది ప్రశాంత్‌భూషన్ సమర్పించారు. ఇలా ఆయా రాష్ట్రాలు సవరణలు చేయడం ఆర్టికల్ 32ప్రకారం వాటిని చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం తెలుగు రాష్ట్రాలు సహా ఐదు రాష్ట్రాలను కౌంటరు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.