క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరోలు, డిసెంబర్ 11: మండలంలోని గుంర్రెడ్డిపల్లి వద్ద రోడ్డుమార్జిన్‌లో ఆపి ఉన్న ఆటోను వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఆటోడ్రైవర్ గణేష్ (34) మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. గుంర్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గణేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ప్రయాణికుల కోసం రోడ్డుపక్కన ఆటో ఆపి వేచి ఉన్నాడు. వేగంగా లారీ వస్తుండగా దాని వెనుక ప్రైవేటు వాహనం వస్తున్నది. స్పీడ్‌బ్రేకర్ వద్ద లారీని డ్రైవర్ వేగం తగ్గించడంతో వెనుకవైపు వస్తున్న వ్యాను లారీని ఢీకొంటుందనే ఆందోళనతో రోడ్డుమార్జిన్ వైపు మళ్లించాడు. అక్కడ ఆగి ఉన్న ఆటోను ఢీకొనడంతో 15 అడుగుల మేర ఆటో దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో ఆటోలో ఉన్న గణేష్‌కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరుకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

మహిళపై దాడి
చీరాల, డిసెంబర్ 11: మహిళపై ఇరువురు దాడిచేసి గాయపరచిన సంఘటన మంగళవారం స్ధానిక కుందేరు ఒడ్డునగల వెంగళరావునగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు..వెంగళరావునగర్‌కు చెందిన దేవరపల్లి లుధియా, అనిల్ భార్యాభర్తలు. తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె,కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె భర్త రెండేళ్ళక్రితం మృతి చెందాడు. దీంతో ఆమె బావ, తోడికోడలు కలిసి ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోవాలంటూ సూటిపోటి మాటలతో తిడుతున్నారు. ఇంటివద్ద ఆమెను వారివురు కొట్టి గాయపరచారు.

క్రాకర్స్ పేలి సినీ హీరోకు గాయాలు
చీరాల, డిసెంబర్ 11: కూల్ క్రాకర్స్ పేలి సినీ హీరోకు గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి వేటపాలెం రామాపురంలో చోటుచేసుకుంది. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలమేరకు హైద్రాబాద్‌కు చెందిన కొందరు సినీ బృందం రామాపురంలో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా హీరో అయిన భయంకర శ్రీనివాస సందు పృధ్వీ చేతికి, కాళ్ళకు కూల్ క్రాకర్స్ తగిలించి షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రాకర్స్ ప్రమాదవశాత్తు పేలిపోవడంతో సందు పృధ్వీకి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో తోటి సినీ యూనిట్ బృందం చీరాలలోని ప్రవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.