క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, డిసెంబర్ 12: టీవీలో వస్తున్న క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను చూస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఒక ముఠాను మంగళవారం అర్ధరాత్రి రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఐ బి పెద్దిరాజు వివరాలు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిని స్వాధీనం చేసుకున్న నగదు, టీవీ, సెల్‌ఫోన్లతో సహా హాజరుపరిచారు. మండలంలోని కొమరాజులంక హనుమాన్‌నగర్‌లోని గుర్రాల రాజు అనే వ్యక్తి ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతున్న మఝాన్సీ సూపర్ లీగ్‌కు సంబంధించి జేఎస్, టీఎస్ జట్ల మధ్య జరుగుతున్న 20-20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి కొంతమంది సెల్‌ఫోన్ల ఆధారంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీనితో ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుర్రాల రాజుతోపాటు అక్కడ ఉన్న చింతపల్లి గోవిందు, సత్యవరపు వీరబాబు, మండా లక్ష్మీనారాయణ, కర్రి లక్ష్మణరెడ్డి, కాకుమళ్ల శ్రీనివాసరావు, దైవాల వెంకట సత్యనారాయణ, మద్దూరి రాజు, బండారు వీరబాబు అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బెట్టింగ్ కోసం డిపాజిట్‌గా గుర్రాల రాజు వద్ద ఉంచిన రూ.45,200 నగదును, ఒక ఎల్‌ఈడీ టీవీ, ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్సై విద్యాసాగర్, సిబ్బందిని సీఐ అభినందించారు. అరెస్టు చేసిన తొమ్మిది మందిని కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. ఈసమావేశంలో ఎస్సై సీహెచ్ విద్యాసాగర్, హెచ్‌సీలు పి అమ్మిరాజు, దుర్గారావు, కానిస్టేబుళ్లు గీతాకృష్ణ, సురేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి
*26 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
శంఖవరం, డిసెంబర్ 26: మండలంలోని కత్తిపూడిలోగల శ్రీ సీతారామాంజనేయ రైస్‌మిల్లుపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి, 26 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు సాయిరమేష్, గోపాలరావు నేతృత్వంలో సిబ్బంది రైస్‌మిల్లుపై దాడి చేశారు. ఈ దాడి సమయంలో ఆటోలో తీసుకువచ్చిన 26 బస్తాల పీడీఎస్ బియ్యంతోపాటు, మిల్లులో నిల్వ చేసిన 30.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 671 క్వింటాళ్ల పీఎంఆర్ ధాన్యం, 114 క్వింటాళ్ల సీఎంఆర్ బియ్యం, 146 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్ల నూకలను కూడా సీజ్ చేయగా, వీటి విలువ 24,64,950 రూపాయులు ఉంటుందని అధికారులు తెలిపారు. సరుకుతోపాటు మిల్లు యజమాని జ్యోతుల సీతారాంబాబుపై సెక్షన్ 6(ఎ) నమోదు చేయగా, ఐపీసీ 420, సెక్షన్ 7(జి) ఈసీ చట్టం ప్రకారం మిల్లు యజమాని, ఆటో డ్రైవర్ దొరలపై కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ఎవ్వరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.