క్రైమ్/లీగల్

కారు, లారీ ఢీకొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, డిసెంబర్ 12: శ్రీకాళహస్తి-నాయుడుపేట జాతీయ రహదారిలోని మిట్టకండ్రిగ వద్ద బుధవారం కారు, లారీ ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ సహా ముగ్గురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా పెళ్లకూరుకు చెందిన వెంకట్రామిరెడ్డి (57), సౌజన్య (42), రాఘవ రెడ్డి (52)లు డ్రైవర్ రవితో కలిసి వస్తుండగా మిట్టకండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.