క్రైమ్/లీగల్

ఎమ్మెల్యేగా ఈరన్న అనర్హుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యే కె.ఈరన్నకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా కె.ఈరన్న (తెలుగుదేశం) అనర్హుడు అంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఈరన్న శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తులు ఏకే సిక్రీ, అశోక్‌భూషన్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మడకశిర ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
తిప్పేస్వామిని ఎమెల్యేగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్థించింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఈరన్న నామినేషన్ పత్రంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి మోసగించారంటూ వైకాపా తరఫున పోటీచేసిన నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో కేసు వేశారు. కర్నాటక రాష్ట్రం హిరియూరు తాలూకా బీటీ కోట గ్రామంలో ఈరన్న సతీమణి శివమ్మ అంగన్‌వాడీ ఉద్యోగిగా పని చేస్తుండగా, కర్నాటకలో పలు కేసులు ఆయనపై నమోదు కాగా అలాంటివేవీ లేవని అఫిడవిట్‌లో పేర్కొనడంతో వైకాపా నేతలు వాటి వివరాలు సేకరించి హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులు ఈరన్న ఎన్నిక చెల్లదంటూ ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఈరన్న ఎన్నిక చెల్లదని పేర్కొంటూ రెండో స్థానంలో నిలిచిన వైకాపా అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని శాసనసభ్యునిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈరన్న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈరన్న పిటీషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై ఎమ్మెల్యే ఈరన్న స్పందిస్తూ మరోసారి సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

చిత్రం..ఎం. ఈరన్న