క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 12: ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సింలు(55) రెండు రోజుల క్రితం ఎనె్నపల్లి నుండి మద్గుల్ చిట్టంపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఉన్న నీటికుంటలో స్నానానికి దిగాడు. ఈత రాకపోవడంతో అందులో చిక్కుకుని మృతి చెందాడు. గట్టుపైన ధరించిన దుస్తులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని సీఐ సీతయ్య, ఎస్‌ఐ లక్ష్మయ్య పరిశీలించారు.