క్రైమ్/లీగల్

దొంగనోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 13: రామచంద్రపురం పట్టణంలో దొంగ నోట్లు మారకం చేస్తున్న ఒక వ్యక్తిని రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ నేతృత్వంలో ఎస్సై ఎస్ లక్ష్మి తదితర సిబ్బంది పట్టుకోవడంతో తీగలాగితే డొంక కదిలినట్టు మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అసలు నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ శ్రీ్ధర్‌కుమార్ వివరించారు. రామచంద్రపురం పోలీసుస్టేషన్‌లో గురువారం విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. కొవ్వూరి వీరవెంకట సత్యనారాయణరెడ్డి అలియాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బుధవారం 500 రూపాయల దొంగ నోట్లు మారకం చేస్తున్న సమయంలో అనుమానంతో పలువురు తమకు ఫిర్యాదు చేయగా, సదరు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. అనంతరం తాము విచారణ చేయగా, సత్యనారాయణరెడ్డి వద్ద పనిచేస్తున్న బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన పడాల వీరవెంకట రామారెడ్డి, పడాల సూర్యనారాయణరెడ్డి కూడా దొంగనోట్ల మారకం చేస్తున్నట్టు దృష్టిలోకి రాగా, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. లక్షా యాభైవేల రూపాయలు విలువ చేసే దొంగ నోట్లను మహేంద్రవాడకు చెందిన తేతలి శివారెడ్డి వద్ద నుంచి తీసుకున్నట్టు నిందితులు అంగీకరించినట్టు సీఐ తెలిపారు. వారి నుంచి లక్షా 15వేల రూపాయలు విలువ చేసే 500 రూపాయల దొంగనోట్లను స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. అసలు నిందితుడు తేతలి శివారెడ్డి పరారీలో ఉన్నాడని చెబుతూ దొరికిన ముగ్గురు నిందితులను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు. జెరాక్స్ నోట్లుగా ఉన్నాయని, ఒకే నెంబరుపైన మూడు నుంచి పది నోట్ల వరకు ఉన్నాయని అంటూ గతంలో ఇటువంటి కేసుల్లో శివారెడ్డి రాజమహేంద్రవరంలో పట్టుబడి అరెస్టు అయినట్టు, తదనంతరం పరారీలోకి వెళ్లినట్టు సీఐ తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎస్సై ఎస్ లక్ష్మి పాల్గొన్నారు.