క్రైమ్/లీగల్

ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత ప్రభుత్వం 1982లో జమ్మూకాశ్మీర్‌లో ప్రవేశపెట్టిన పునరావాస చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ చట్టం కింద పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చిన ఎంతమంది వలసదారులు దరఖాస్తు చేశారో వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్‌లు ఎస్‌కె కౌల్, కేఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో తమకు తగిన వివరాలను అందజేయాలని గురువారం ఆదేశిస్తూ కేసును వచ్చే ఏడాది జనవరి 22కు వాయిదా వేసింది. ఈ చట్టం దేశ విభజన సమయంలో 1947లో పాక్‌కు వలస వెళ్లి తిరిగి భారత్‌కు రావాలనుకున్న వారిని ఉద్దేశించినది కదా? ఈ చట్టం ప్రకారం ఎంతమంది వలసదారులు, వారి వారసులు రాష్ట్రానికి వచ్చారు, వారిలో ఎంతమంది శాశ్వత నివాసులు ఉన్నారు తదితర వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదిని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీర్ రాఅష్టానికి ప్రత్యేక హోదా లభించింది. అయితే పాక్ వలసదారులకు తిరిగి దేశానికి వచ్చే వీలు కల్పిస్తూ 1982 చట్టాన్ని తెచ్చారు. అయితే ఈ చట్టానికి నిర్దేశిత కాలపరిమితి ఉందని పేర్కొంటూ 2001లో సుప్రీం కోర్టు దీని అమలును నిలిపివేసింది. అయితే చిరకాలంగా ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయని, దీనిపై సుప్రీం తగిన నిర్ణయం తీసుకోవాలని జమ్మూకాశ్మీర్ నేషనల్ పాంథర్ పార్టీ (జెకెఎన్‌పీపీ) విజ్ఞప్తి చేసింది. ఈ అంశంలో రాజ్యాంగబద్ధమైన అంశాలు ముడిపడి ఉన్నందున అవసరమైతే దీనిని విస్తృత ధర్మాసనానికి పంపిస్తామని సుప్రీం కోర్టు 2016లో పేర్కొంది. తర్వాత దానిపై విచారించిన కోర్టు అందులో రాజ్యాంగపరమైన అంశాలేవీ లేవని నిర్ణయించింది. 1982 పునరావాస చట్టం 1947-54 మధ్య భారత్ నుంచి పాక్‌కు వెళ్లి తిరిగి వచ్చేవారికి ఉద్దేశించినది తప్ప, వారి వారసులకు సంబంధించినది కాదన్న వాదనను సైతం పలువురు లేవనెత్తారు. ఈ చట్టం విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంలో దాఖలైన కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ సాగుతోంది.