క్రైమ్/లీగల్

రాఫెల్‌పై నేడు సుప్రీం తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశాన్ని కుదిపేసిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది. ఫ్రాన్‌తో యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందలో వేల కోట్లరూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 14న విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన రాఫెల్ విమానాల కేసులో న్యాయవాది ఎంఎల్ శర్మ మొదటి పిటిషనర్‌గా ఉన్నారు. తరువాత మరో న్యాయవాది వినీత్ ధండా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానం పర్యవేక్షణలోనే కేసు విచారణ జరపాలంటూ ధండా కోరారు. అలాగే ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా మరోపిటిషన్ దాఖలు చేశారు. తరువాత కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కలిసి రాఫెల్ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా 36 యుద్ధ విమానాల కొనుగోలుకు చెల్లించిన మొత్తంపై వివరాలు వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. రాఫెల్ ఒప్పందం ఫ్రాన్స్, భారత్ మధ్య జరిగింది. ఒప్పందంలో 58,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా పేర్కొన్నారు. యుపీఏ హయాంలో చేసుకున్న ఒప్పందాన్ని కాదని భారీ మొత్తానికి ఖరారు చేశారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసే ఇదంతా జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనేకసార్లు ఆరోపించారు. ఆర్థిక మంత్రి జైట్లీ, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ కాంగ్రెస్ ఆరోపణలు తోసిపుచ్చారు. యుపీఏ హయాంనాటి ఒప్పందానే్న కొనసాగించామని కేంద్రం స్పష్టం చేసింది.