క్రైమ్/లీగల్

వెంటనే ఉరితీయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన నిర్భయ కేసులో మరణశిక్ష పడిన నలుగురు నిందితులకు వెంటనే శిక్షను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ‘మేము వెంటనే ఢిల్లీ వెళ్లి వారికి ఉరి శిక్ష వేయాలా? ఎలాంటి విజ్ఞాపన మీరు చేస్తున్నారు?’ అని జస్టిస్‌లు మదనద్ బి లోకుర్, దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ‘మీరు కోర్టును పరిహాసం చేస్తున్నారు’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. 2012, డిసెంబర్ 16న దేశరాజధాని ఢిల్లీలో ఒక పారామెడికల్ విద్యార్థినిని నడుస్తున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు దారుణంగా హింసించి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను బస్సులోంచి బయటకు విసిరేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ కేసులోని నిందితుల్లో రామసింగ్ అనే వ్యక్తి జైలులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మైనర్ అయిన మరో బాలుడికి గరిష్ట శిక్ష అయిన మూడేళ్లు పడింది. కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు మిగిలిన నలుగురు నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. తమకు పడిన శిక్షను సవాల్ చేస్తూ నిందితులు ముఖేష్ (31), పవన్ గుప్తా (24), వినయ్‌శర్మ (25) సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నతన్యాయస్థానం 2017లో కొట్టివేసింది. కాగా, ఈ కేసులో మరో నిందితుడైన అక్షయ్‌కుమార్ ఉరిశిక్షపై ఎలాంటి రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. కాగా, నిందితులకు వెంటనే మరణశిక్ష అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అలోఖ్ అలోక్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం వాదనలు జరిగాయి. నిర్భయ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు తమకు పడ్డ మరణశిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై తీర్పు వెలువడి నాలుగున్నర నెలలు దాటినా వారికి శిక్ష అమలు కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి దిగువకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నిందితులకు పడ్డ శిక్ష విషయంలో ఉన్నత న్యాయస్థానాల నిర్ణయం ఎనిమిది నెలల్లోగా జరగాలని, నిందితులకు మరణశిక్ష పడ్డ తర్వాత దాని అమలు చేయడంలో ఆలస్యం జరిగితే అది చెడు దృష్టాంతంగా నిలుస్తుందని, దీనివల్ల అత్యాచారాలు సైతం పెరిగిపోతాయని తెలిపారు. నిర్భయ కేసులో నిందితులు నేరానికి పాల్పడ్డ ఐదు సంవత్సరాల తర్వాత కూడా వారికి శిక్ష అమలు కాకపోతే, తామేమీ చేసినా ఏమీ కాదనే సంకేతాలు రేపిస్టులకు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. అంతేకాకుండా అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి పడ్డ శిక్ష అమలు విషయంలో కాలపరిమితిని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని, దీని ద్వారా ఈ కేసుల్లో కింది కోర్టుల్లో శిక్ష పడ్డ వారు హైకోర్టు, అప్పీల్, రివ్యూ, సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్, తర్వాత రాష్టప్రతికి క్షమాభిక్ష వంటి ప్రక్రియలను తమకు అనుకూలంగా మార్చుకుని శిక్ష అమలును ఎంతో ఆలస్యం చేస్తున్నారని, ఇవన్నీ గరిష్టంగా ఎనిమిది నెలల్లో పూర్తయ్యేలా మార్గదర్శకాలు తయారు చేయాలని ఆయన సుప్రీంను కోరారు.