క్రైమ్/లీగల్

మహా సీఎం ఫడ్నవీస్‌కు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నిక రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్‌లో ఫడ్నవీస్ తనపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలు వెల్లడించ లేదని అభియోగం. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో కేసులు వివరాలు దాచారని సతీష్ ఊకే బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. బాంబే హైకోర్టు సతీష్ పిటిషన్‌న తోసిపుచ్చడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారధ్యంలోని న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పిటిషన్‌ను విచారించింది. 2014 ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ దాఖలు చేసిన అఫిడవిట్ కాపీని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుకు అందజేశారు. ఫడ్నవీస్‌పై క్రిమినల్ కేసులు పెండింగ్‌లోఉన్నప్పటికీ వెల్లడించలేదని సిబాల్ తెలిపారు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని 125ఏ సెక్షన్ కింద ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎన్నికను రద్దుచేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించేదిగా సిబాల్ వాదించారు. 1996, 1998 సవంత్సరాల్లో ఫడ్నవీస్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.